వరంగల్ ‘మెడికవర్‌‌’లో కొలోరెక్టల్  క్యాన్సర్ ఆపరేషన్ సక్సెస్ 

వరంగల్ ‘మెడికవర్‌‌’లో కొలోరెక్టల్  క్యాన్సర్ ఆపరేషన్ సక్సెస్ 

హనుమకొండ, వెలుగు: అరుదైన కొలోరెక్టల్ క్యాన్సర్ కు వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్నాయని, దీంతో మెడికవర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డా.సునీల్ నాగుల ఆధ్వర్యంలో ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించామన్నారు. ఈ డిస్టల్ రెక్టల్ క్యాన్సర్ కేసులో యాంటీరియర్ రిసెక్షన్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం రోగి కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.